జాకెట్టు…రాకెట్టు

జాకెట్టు…రాకెట్టు

ఈ రెంటి మధ్య ఉన్న తేడా ఏమిటి…అని
అష్టావధానంలో ఓ పృచ్ఛకుడు అడిగితే…రాకెట్టు వేగంగా పైకి పోతే…జాకెట్టు అంతే వేగంతో
కిందికి వస్తోంది అని అష్టావధాని సరాదాగా చెప్పాడు. ప్రసుత్తం అదే ఫ్యాషన్‌. లక్షల రూపాయల ఖరీదు చేసే చీర కొన్నా జాకెట్టు కుదరక పోతే ఖర్చంతా వృథా అనే మహిళామణులెందరో. వెడ్డింగ్శారీ లేదా ఆఫీస్వేర్‌.. రోజువారీ ఇళ్లలో కట్టుకునే చీర.. ఏదైనా కావొచ్చు దానికి అందం రావాలంటే తగిన జాకెట్టు ఉండాల్సిందే. వాటి కోసమే చాలా మంది మహిళలు సరైన డిజైనర్ల కోసం వెదుకుంటారు. టైలర్లు కూడా ఇంటర్నెట్లో వెదికి విభిన్న స్టైల్స్ను అనుసరించే ప్రయత్నం చేస్తున్నారు. జాకెట్టు అందంగా ఉండాలంటే ఫ్యాబ్రిక్బాగుండటంతో పాటుగా టైలర్సరైనవారు ఉండాలనేది ముఖ్యమే కానీ ఎలాంటి డిజైన్లు ఎంచుకోవాలనేది ప్రాధాన్యతాంశమే. బ్లౌజ్డిజైనర్ప్రియ చెబుతున్న ఎవర్గ్రీన్డిజైన్లు ఏమిటంటే

 
      వీ – బ్యాక్‌, బోట్‌ నెక్‌లైన్‌, టైమ్‌లెస్‌,  ఇప్పుడు ట్రెండీగా కొనసాగుతోంది. బ్యాక్‌ నెక్‌ లైన్‌ మరీ లోతుగా ఉండకుండా, బోట్‌ షేప్‌లో క్లోజ్‌ కట్‌ అవుతుంది. దీనిలోనూ చాలా వేరియేషన్స్‌ ఉన్నాయి. స్లిట్‌డిజైన్‌, షీర్‌బ్యాక్‌తోనూ దీన్ని కలపొచ్చు. మెడ పొడవు తక్కువగా ఉన్నవారికి రెగ్యులర్‌ బోట్‌నెక్‌ జాకెట్టు బాగోదు.

 
 విండో స్టైల్‌ : సాధారణంగా ఈ విండోస్టైల్‌ను క్లోజ్‌ – కట్‌ నెక్‌లైన్‌, బోట్‌నెక్‌ లైన్‌, హై నెక్‌లైన్‌లో చేస్తారు. ఈ విండో ఎలా ఉండాలనే దానిపై స్టైల్‌ ఆధారపడి ఉంటుంది.

 హాల్టర్నెక్‌ : పార్టీవేర్‌ లెహంగాలు ధరించినప్పుడు హాల్టర్‌ నెక్‌ బాగుంటుంది. అందరికీ ఈ షేప్స్‌ బాగుంటాయని చెప్పలేం. 

 ప్రిన్సెస్కట్‌ : ఈ డిజైన్‌లో ఆర్మ్‌హోల్‌, బ్లౌజ్‌ బ్యాక్‌ బాడీని పైపింగ్‌ లేదంటే ఎంబ్రాయిడరీతో వేరు చేస్తారు. స్ట్రింగ్స్‌, బ్లాక్‌ క్లోజర్‌, ఇతర డిటైల్స్‌ జోడిస్తారు. 

 కాలర్డ్బ్యాక్స్టైల్‌ : వీటిలో కాలర్స్‌ రెండు వైపులా ఒకేలా ఉంటాయి. ఈ తరహా జాకెట్లు కాటన్‌ శారీలతో బాగుంటాయి. కాస్త వయసు మళ్లినవారు ఈ తరహా స్టైల్‌ అనుసరిస్తే టాప్‌బన్‌ హెయిర్‌స్టైల్‌, క్రేప్‌ శారీ అదీ ప్రింటెడ్‌ కాలర్డ్‌ బ్లౌజ్‌ బాగుంటుంది.

 
          క్లాసిక్‌ షేప్స్‌ విత్‌ స్ట్రింగ్స్‌.. రౌండ్‌, యు, స్క్వేర్‌, స్వీట్‌ హార్ట్‌, ప్రిన్సెస్‌ కట్‌.. ఇలా ఏ షేప్‌ అయినా లట్కన్స్‌, బీడ్స్‌ లేదంటే మరేదైనా డెకరేటివ్‌ ఎలిమెంట్‌తో స్ట్రింగ్స్‌, సై్ట్రప్స్‌ లాంటివి ఈ డిజైన్స్‌లో ఉంటాయి. వైవిధ్యమైన, అత్యంత ప్రాచుర్యం పొందిన బ్లౌజ్‌డిజైన్స్‌లో ఇది ఒకటి. దాదాపు ప్రతి ఒక్కరికీ ఈ డిజైన్స్‌ బాగానే ఉంటాయి. మరీ బక్కగా ఉన్నవారు కాస్త ఆలోచించాలి. 

తాజా సమాచారం

Latest Posts

Featured Videos