తెలుగుకే తొలి ప్రాధాన్యం

తెలుగుకే తొలి ప్రాధాన్యం

మెగా పవర్ స్టార్ రాంచరణ్ వరుస విజయాలతో బాక్సాఫీస్ వద్ద సునామీ సృష్టిస్తున్నాడు. రంగస్థలం చిత్రం నాన్ బాహుబలి క్యాటరిగిలో ఉత్తమ వసూళ్లను సాధించింది. ప్రపంచవ్యాపంగా రూ.200 కోట్లకుపైగా భారీ కలెక్షన్లు సాధించింది. అయితే స్టార్ స్టామినా పెరిగినా గత కొద్దికాలంగా రాంచరణ్ బాలీవుడ్‌కు దూరంగా ఉంటారు. తాజాగా వినయ విధేయ రామ ప్రమోషన్లో భాగంగా రాంచరణ్ మాట్లాడుతూ సినిమా విషయాలను వెల్లడించారు.బాలీవుడ్ రీ ఎంట్రీ గురించి బాలీవుడ్ రీ ఎంట్రీపై అడిగిన ప్రశ్నకు సమాధానం ఇస్తూ.. బాలీవుడ్ రంగానికి వెళ్లడంపై ఆలోచించడం లేదని ఐన తెలుగులో కూడా భారీ కలెక్షన్స్ వస్తున్నాయని అటువంటపుడు బాలీవుడ్ వెళ్లడం ఎందుకంటూ ప్రశ్నించారు.ప్రస్తుతం తెలుగు సినిమా కూడా బాలీవుడ్ కి ధీటుగా ఎదిగిందని ఈ తరుణంలో అక్కడికి వెళ్లి రిస్క్ చేయడం కష్టమే అని అన్నారు.ఇక ముందు కూడా నాకు తెలుగు సినిమానే ముఖ్యమని తెలుగుకే ప్రాధాన్యత ఇస్తానంటూ స్పష్టం చేసారు.. సౌత్ ఇండియా వరకే నా ప్రాధాన్యత. అంతకుమించి ఆశపడటం నాకు ఇష్టం లేదు. నాకు అతిగా ఆశపడటం కంటే సుఖంగా రిలాక్స్‌గా ఉండటమే ఇష్టం అని రాంచరణ్ అన్నాడు.గతంలో అమితాబ్ బచ్చన్ నటించిన జంజీర్ సినిమాను రీమేక్‌గా అదే పేరుతో బాలీవుడ్ రంగంలో ఎంట్రీ ఇచ్చాడు. ప్రియాంక చోప్రా జంటగా నటించింది. అయితే ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద దారుణంగా బోల్తాపడటంతో మళ్లీ బాలీవుడ్ ముఖం చూడలేదు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos